ప్రజాశక్తి - కోసిగి
పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని ఆదోని డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాసులు తెలిపారు. గురువారం కోసిగి మేజర్ పంచాయతీ సర్పంచి అయ్యమ్మ ఆధ్వర్యంలో గ్రామంలో డ్రెయినేజీలో పేరుకుపోయిన చెత్త, చెదారాలను పారిశుధ్య కార్మికులు తొలగించి, గ్రామ వీధులను శుభ్రం చేశారు. డిఎల్‌పిఒ శ్రీనివాసులు ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంటువ్యాధులు సోకకుండా దోమలను నివారించడానికి ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. తాగునీటి వేడి చేసి చల్లార్చుకుని తాగాలన్నారు. దోమల బారిన పడకుండా దోమతెరలను వాడాలని సూచించారు. ఇన్‌ఛార్జీ ఇఒ చంద్రశేఖర్, వైసిపి యువ నాయకులు రాజేష్ పాల్గొన్నారు.