Apr 19,2023 21:07

మాట్లాడుతున్న సుభాష్‌ పి కుప్పుసామీ

ప్రజాశక్తి-గుంటూరు : విద్యార్థులు పరిశోధనల అభివృద్ధిపై పెట్టుబడి పెట్టాలని చెన్నైలోని బ్రహ్మాస్త్ర ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకులు, సీఈవో సుభాష్‌ పి కుప్పుసామీ అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలోని డీన్‌ ప్రమోషన్స్‌, కొలాబరేషన్స్‌, ఫ్యాకల్టీ అఫైర్స్‌ ఆఫీస్‌, విజ్ఞాన్‌ టెక్నాలజీ బిజినెస్‌ ఇంకుబేటర్‌ సంయుక్త ఆధ్వర్యంలో 'టెక్నోలాజికల్‌ కాంపిటీటివ్‌నెస్‌ ఇన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌' అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. సుభాష్‌ పి కుప్పుసామీ మాట్లాడుతూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్‌గా ఎదగాలనుకునే విద్యార్థులు ఇన్నోవేషన్‌, కాస్ట్‌ సేవింగ్స్‌, కస్టమర్‌ ఎంగేజ్‌మెంట్‌, గ్లోబల్‌ రీచ్‌, న్యూ బిజినెస్‌ మోడల్స్‌, కాంపిటీటివ్‌ అడ్వాంటేజ్‌, ఫండింగ్‌, కొలాబరేషన్‌, డెసిషన్‌ మేకింగ్‌, ఫ్లెక్సిబిలిటీ, సస్టైనబిలిటీ వంటి అంశాల్లో పట్టు సాధించాలన్నారు. కొత్త ఐడియాలను వెంటనే అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి విడుదల చేయాలని సూచించారు. వినియోగదారులు ఆశిస్తున్న సర్వీసులను మించి అందించడానికి ప్రయత్నిస్తేనే ఆ ప్రొడక్ట్‌ త్వరగా ప్రజల్లోకి వెళ్తుందన్నారు. కార్యక్రమంలో చెన్నైలోని బ్రహ్మాస్త్ర ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ సురేంద్రన్‌ గణేషన్‌, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.