ప్రజాశక్తి - ఎచ్చెర్ల: రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం ఆంగ్ల అధ్యాపకుడు రాకోటి శ్రీనివాసరావు రచించిన 'ఎ క్రిటికల్ ఎనాలసిస్ ఆఫ్ హ్యూమన్ పైడికమెంట్ ఇన్లా సెలక్ట్ నావల్స్ ఆఫ్ చమన్- 'సహల్' పరిశోధనాత్మక గ్రంథాన్ని ట్రిపుల్ ఐటి డైరెక్టర్ పి.జగదీశ్వరరావు, ఒఎస్‌డి సుధాకర్‌బాబు సోమవారం ఆవిష్కరించారు. సహ రచయితగా జెఎన్‌టియు అనంతపురం ఆంగ్ల ఆచార్యులు వి.బి చిత్ర గ్రంథ రచనలో సహకరించారు. విద్య, పరిశోధనా రంగాల్లో శ్రీనివాసరావు చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో ఎఒ ముని రామకృష్ణ, డీన్ కె.ఎం.కె చౌదరి, ఎఫ్‌ఒ చల్లా అసిరినాయుడు, డీన్ వెల్ఫేర్ జి.రవి, ఆంగ్ల విభాగాధిపతి విశ్వనాథ్ పాల్గొన్నారు.