Sep 16,2022 23:46

సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్‌ ఛాయాకుమారి

ప్రజాశక్తి- గాజువాక: పరిశోధనా పద్ధతులపై గాజువాక చైతన్య డిగ్రీ, పీజీ కాలేజీలోజాతీయ సదస్సు నిర్వహించారు. బెంగళూరు ఎఎంసి ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఛాయాకుమారి పాల్గొని, పరిశోధనా పద్ధతులు, నమూనాల సేకరణ, రీసెర్చి డిజైన్‌, డాటా ఎనాలసిస్‌, లిటరేచర్‌ పరిశోధన, థీసెస్‌ సమర్పణ వంటి అంశాలపై విద్యార్థులు, అధ్యాపకులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కాలేజీ కరస్పాండెంట్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ, ఏటా వివిధ అంశాలపై నిపుణులను రప్పించి, ఇటువంటి సదస్సులను కాలేజీలో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చంద్రమహాలక్ష్మి, డైరెక్టర్‌ కృష్ణకుమారి పాల్గొన్నారు.