హిందూపురం : కేంద్ర ప్రభుత్వం పరొశోధన శాస్త్రవేత్తలకు పూర్తి సహకారం అందిచినప్పుడే దేశ ప్రగతి సాధ్యం అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం రూరల్ మండలం కిరికెర వద్ద ఉన్న ఎల్‌ఆర్‌జి జూనియర్ కళాశాలలో ఐఎంఎఫ్‌ఎస్-2023 సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా ఐఎంఎఫ్‌ఎస్ జిల్లా ఇన్‌ఛార్జ్ మల్లిక్‌దత్ కుమార్ మాట్లాడుతు పరిశోధన శాస్త్రవేత్తలకు దేశ జిడిపిలో కనీసం 3శాతం కేటాయించాలన్నారు. దీంతో పాటు ఆర్టికల్ 51ఎ(హెచ్)ను పునరుద్ధిరించాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్‌సిఈఆర్‌టి సిలబస్ నుంచి డార్విన్ సిద్దాంతం, మాండలీఫ్ అవర్తన పట్టిక, మొఘలుల చరిత్ర వంటి ముఖ్యమైన అంశాలను తొలగించరాదన్నారు. ఐఎంఎఫ్‌ఎస్ సభ్వులు సుధీంద్ర మాండలీఫ్ అవర్తన పట్టిక ప్రాముఖ్యతను వివరించారు. జ్యువాలజీ అధ్యాపకులు నరేంద్ర డార్విన్ ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం విద్యార్థులు వాతవరణంలోని మార్పులు, శాస్త్రీయ పద్ధతిలో వాతావరణ కాలుష్యం, పర్యావరణం, సర్వనాశానాలు వంటి అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రవినాయక్, సుధాకర్, రామకృష్ణారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










