* దాతల నుంచి అనూహ్య స్పందన
* ఆరు రోజుల్లో రూ.12 లక్షలు అందజేత
ప్రజాశక్తి- కవిటి: మానవత్వం పరిమళించింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఆద్య కోసం దాతలు అనూహ్యంగా స్పందిస్తున్నారు. ఆద్య తండ్రి చిరంజీవితో కలిసి 2005-06లో పదో తరగతి చదివిన స్నేహితులు తమ వంతుగా రూ.78,801లను అప్పటి తమ ఉపాధ్యాయుడు పండి బలరామమూర్తి, వ్యాపారవేత్త పాండవ రామారావు చేతులు మీదుగా చిరంజీవి తండ్రి తులసయ్యకు అందించారు. అదే విధంగా ప్రగడపుట్టుగకు చెందిన ముత్యాల కావ్య తన స్నేహితులతో కలిసి సేకరించిన రూ.40 వేలు, పాండవ రామారావు రూ.21 వేలు, ఎస్జిఎఫ్ స్వచ్ఛంద సంస్థ రూ.26 వేలు, కేశుపురానికి చెందిన శ్రీకాళీమాత సేవా సమితి రూ.25 వేలు, ఎన్‌ఆర్‌ఐ శిరీష రూ.20 వేలు, అన్నవరం హెల్పింగ్ హేండ్స్ రూ.15 వేలు, జైహింద్ ఫౌండేషన్ రూ.10 వేలు, పలాసకు చెందిన పవనపుత్ర సేవా సంస్థ రూ.10 వేలు, కపాసుకుద్దికి చెందిన రాధకృష్ణ సంఘం రూ.5 వేలు, ఈదుపురానికి చెందిన చిరంజీవి స్నేహితులు రూ.5 వేలు, బాలాజీపుట్టుగకు చెందిన బెందాలం శ్రీపతి రూ.5 వేలు, ఎస్‌సిఎం ట్యూషన్ సెంటర్ చెందిన వారు రూ.3,250 పాప చికిత్స కోసం అందించారు. ఇప్పటి వరకూ పాప చికిత్స కోసం దాతల నుంచి తనకు రూ.12 లక్షలు అందాయని, స్పందించిన ప్రతి హృదయానిరీ పాదాభి వందనాలని పాప తండ్రి చిరంజీవి తెలిపాడు.










