ప్రజాశక్తి -కంచరపాలెం : ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు రెండేళ్ల వయా పరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ పి. విజయ తెలిపారు. ఇదే సమయంలో ప్రిలిమ్స్ అభ్యర్థులు సన్నద్ధతకు గడువు పెంచాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివైఎఫ్‌ఐ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి నిర్వరామ పోరాట ఫలితమే పోలీసు ఉద్యోగాలకు వయా పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచిందన్నారు. అయితే పరీక్షకు సన్నద్ధం అయ్యే వారికి 50 రోజుల సమయం సరిపోదని, సిలబస్ కూడా పూర్తవ్వదనీ, ప్రిలిమ్స్ కూడా గడువు పెంచాలని కోరారు. రాష్ట్రంలో పోలీస్‌శాఖలో ఖాళీగా ఉన్న 21 వేల పోస్టులు భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా జైళ్లు, అగ్నిమాపకశాఖలోనూ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జోన్ అధ్యక్ష ,కార్యదర్శులు: బి. ప్రసాద్, ఎస్. శ్రావణ్ కుమార్, శరత్, వార్డ్ ప్రెసిడెంట్, సెక్రటరీ: బి.మురళి, పి.రాజశేఖర్ పాల్గొన్నారు.










