Oct 22,2023 00:15

ప్రజాశక్తి - బాపట్ల
రాష్ట్రంలో సామాజిక, విద్య, ఆర్థిక పరమైన బలహీన వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం అనే కొత్త పథకాన్ని అర్హులైన అభ్యర్థులు వినియోగించుకోవాలని ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి జె రాజ్ దెబోరా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యుపిఎస్సీ నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి రూ.1లక్ష నగదు ప్రోత్సాహకం, మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి రూ.50వేలు నగదు ప్రోత్సాహకం అందిస్తారని తెలిపారు. 2023లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అర్హులైన అభ్యర్థులకు రూ.లక్ష నగదు ప్రోత్సాహకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు  డైరెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ, తెలియజేశారని ఆమె తెలిపారు. అర్హులైన అభ్యర్థులు jnanabhumi.ap.gov.in పోర్టల్లో అందించిన వెబ్ లింక్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను నవంబరు 4లోగా నమోదు చేసుకోవాలని కోరారు.