Feb 27,2023 21:58

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
            తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో గిరిజన విద్యార్థి ప్రీతి ఆత్మహత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గుగ్గులోతు కృష్ణనాయక్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బోడా బాలా నాయక్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గిరిజన విద్యార్థులు ఇప్పుడిప్పుడే ఉన్నతవిద్యలో రాణిస్తున్నారని, ఈ తరుణంలో ప్రీతి మృతి బాధాకరమన్నారు. సీనియర్‌ వైద్యవిద్యార్థి సైఫ్‌ వేధిస్తున్నాడని పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపల్‌, హెచ్‌ఒడిలు పట్టించుకోలేదన్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిబాధ్యత వహించాలన్నారు.
చింతలపూడి : ప్రీతి ఆత్మహత్యకు కారకులను శిక్షించాలని కోరుతూ చింతలపూడి పట్టణంలో లంబాడి హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాంబబు, నాయకులు బాణావతు గొపాలకృష్ట, నాగేశ్వరావు పాల్గొన్నారు.