ప్రజాశక్తి-అనంతపురం దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ప్రీ రిపబ్లిక్ పరేడ్‌కు ముగ్గురు జెఎన్‌టియు విద్యార్థులు ఎంపికైనట్లు ఉపకులపతి రంగజనార్ధన తెలిపారు. మంగళవారం స్థానిక జెఎన్‌టియు ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రీ రిపబ్లిక్ పరేడే క్యాంపు కోసం యూనివర్సిటీ స్థాయి ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికలో అనంతపురం జెఎన్‌టియు నుంచి ముగ్గురు అమ్మాయిలు ఎంపికైనట్లు తెలిపారు. సేక్‌సన అంజుమ్ వై.యామిని, కలికిరి ఇంజినీరింగ్ కళాశాల నుంచి డివివిఎస్ చరిత అనే అమ్మాయి ఎంపికైంది. ఎంపికైన అమ్మాయిలు దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1 నుంచి 31వతేదీ వరకూ ప్రీ ఆర్.డి. (ప్రీ రిపబ్లిక్ పేరేడ్ డే) క్యాంపులో పాల్గొంటారని తెలిపారు. అక్కడ ఎంపికైన విద్యార్థులు జనవరి 26న జరిగే రిపబ్లిక్ పేరేడ్ డే క్యాంపునకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ ఎంపికల్లో సెలెక్టు అయిన విద్యార్థులను యూనివర్సిటీ ఉపకులపతి జి.రంగజనార్ధన, రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, అకడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ వి.సుమలత, వైస్ కళాశాల ప్రిన్సిపల్ ఇ.అరుణకాంతి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఎస్.శారద, జి.మమత, డి.విష్ణువర్ధన్, దిలీప్‌కుమార్, ఇతర కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, యూనివర్శిటీ డైరెక్టర్లు ఇ.కేశవరెడ్డి, పి.సుజాత, వి.బి.చిత్ర, ఎ.సురేష్‌బాబు, జి.వి.సుబ్బారెడ్డి, బి.దుర్గాప్రసాద్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఇ.అరుణకాంతి, హాస్టల్ మేనేజర్ టి.బాలనరసయ్య, బి.చంద్రమోహన్‌రెడ్డి, కె.మాధవి, టి.నారాయణరెడ్డి, జి.మమత, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ శారద, ఎం.రామశేఖర్‌రెడ్డి, డి.విష్ణువర్ధన్, దిలీప్‌కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి, భోదన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
పరేడ్‌కు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తున్న జెఎన్‌టియు సిబ్బంది










