విద్యార్థులను అభినందిస్తున్న ఎయు విసి ప్రసాదరెడ్డి
ప్రజాశక్తి- విశాఖపట్నం : ప్రి రిపబ్లిక్‌డే పరేడ్‌కు ఐదుగురు ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ఎంపికయ్యారు. శనివారం వీరిని తన చాంబర్‌లో విసి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి అభినందించారు. ఎయు అనుబంధ కళాశాలకు చెందిన అశ్రీన మీర్జా మహమ్మద్, కె.రచన, కె.కేధశ్రీ, పి.హేమలత, ఎస్.కల్యాణి వచ్చేనెల ఒకటి నుంచి పదో తేదీవరకు విజయవాడ కె.ఎల్ యూనివర్సిటీలో జరిగే ప్రత్యేక శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరిగే రిపబ్లిక్‌డే పరేడ్‌కు ఎయు విద్యార్థులు ఎంపికపై విసి హర్ష్యం వ్యక్తం చేసి, విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమంలోకె.ఎల్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య పార్థసారధివర్మ, ఎయు ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త ఆచార్య ఎస్.హరనాథ్ పాల్గొన్నారు.