Aug 21,2023 22:49

జ్ఞాపికను అందజేస్తున్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌

* ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌
ప్రజాశక్తి-నరసన్నపేట: 
వైసిపి హయాంలో చేపట్టిన ప్రగతిని, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. సోమవారం నరసన్నపేటలో నిర్వహించిన జగనన్న సచివాలయాల కన్వీనర్ల నమోదు శిబిరంలో ఆయన మాట్లాడారు. చిన్న వయసులోనే సమర్థుడైన ముఖ్యమంత్రిగా సిఎం వైఎస్‌ జగన్‌ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో 98 శాతం హామీలను అమలుచేసి జగన్‌ మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ మాట్లాడుతూ సిఎం జగన్‌ ప్రభుత్వ పాఠశాలలకు సరికొత్త రూపునిచ్చారని చెప్పారు. సచివాలయ వ్యవస్థతో గ్రామ స్థాయికి పరిపాలన తీసుకొచ్చారని వివరించారు. కార్యక్రమంలో జెసిఎస్‌ కన్వీనర్లు సురంగి నరసింగరావు, నక్క తులసీదాస్‌, ధర్మాన జగన్‌, కణితి సత్తిబాబు, ఎంపిపిలు ఆరంగి మురళీధర్‌, వాన గోపి, జెడ్‌పిటిసి చింతు అన్నపూర్ణ రామారావు, బిసి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ రాజపు హైమావతి అప్పన్న, ముద్దాడ బైరాగి నాయుడు, రౌతు శంకర్రావు పాల్గొన్నారు.