కుర్చీలను అందజేస్తున్న సంఘం అధ్యక్షురాలు కృష్ణకుమారి
ప్రజాశక్తి -డుంబ్రిగూడ:స్థానిక ప్రెస్ క్లబ్‌కు మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర ఏజెన్సీ మహిళ విబాగా అధ్యక్షురాలు కే.కృష్ణకుమారి గురువారం నాలుగు కుర్చీలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, సమాజంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమైనదని, నిత్యం ప్రజా సమస్యలను వెలికితీసి ప్రభుత్వానికి, అధికారులకు తెలియపరచి పరిష్కరిం చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పి.ధర్మ, జిల్లా నాయకుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు.










