Dec 11,2022 00:02

ీశ్రీనివాస్‌రావును సన్మానిస్తున్న ప్రతినిధులు

ప్రజాశక్తి-నక్కపల్లి :ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు శనివారం మండలంలో కాగిత హౌటల్‌ జాస్‌ వద్ద జిల్లా ఏపీయుడబ్ల్యుజే ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అమరావతి నుంచి విశాఖ వెళ్తున్న ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాసరావుకు ఏపీయుడబ్ల్యుజే ప్రతినిధులతో పాటు, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ తదితరులు స్వాగతం పలికారు. జిల్లా ప్రతినిధులు స్వామి, కోరాడ చంద్రరావు, పాయకరావుపేట ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు ఆచంట రామకృష్ణ, సంఘ ప్రతినిధులు గట్టెం వెంకటరమణ, రమణబాబు, లోవరాజు, సత్యనారాయణ, అశోక్‌ తదితరులు సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. స్థానిక జర్నలిస్ట్‌లతో ఆయన పలు అంశాలపై చర్చించారు.