ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: ప్రేమ కథాంశంతో పాటు హాస్య సన్నివేశాలతో పాప్‌కార్న్ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటుందని హీరోయిన్ అవికాగోర్ అన్నారు. పాప్‌కార్న్ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నగరంలోని ఓ హోటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అవికా గోర్ మాట్లాడుతూ యువతను చిత్రం ఎక్కువగా ఆకట్టుకుంటుందని, సినిమా ఎక్కువ భాగం ఒక లిప్టులో చిత్రీకరించినట్లు తెలిపారు. లిప్టులో జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయన్నారు. దర్శకుడు మురళి మాట్లాడుతూ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇప్పటికే పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, ట్రైలర్, టీజర్‌కు మంచి స్పందన లభించిందన్నారు. హీరో సాయిరోనక్ మాట్లాడుతూ తాను నాలుగు చిత్రాల్లో హీరోగా నటించానని, తొలిసారిగా అవికాగోర్ లాంటి సీనియర్ హీరోయిన్‌తో నటించడం సంతోషంగా ఉందన్నారు. చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. సమావేశంలో నిర్మాత చలపతిరాజు పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.










