Nov 08,2022 23:16

మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.
ప్రజాశక్తి -నర్సీపట్నం రూరల్‌ :
ప్రధాని నరేంద్రమోడీ విశాఖపట్నం పర్యటనకు అంతా తానే అన్నట్లు విజయసాయిరెడ్డి పెద్ద హంగామా చేస్తున్నారని మాజీమంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో, ఈ నెల 11న ప్రధాని విశాఖ వస్తున్నారని, 12న కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపనలు, బహిరంగసభ ఉంటుందన్నారు. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డికి, విశాఖపట్నానికి సంబంధం ఏమిటన్నారు. విశాఖపట్నంలో రూ.45వేల కోట్ల విలువ గల ప్రభుత్వ, ప్రైవేటు భూములను సర్వం దోచుకున్నారన్నారు అటువంటి విజయసాయిరెడ్డి దేశ ప్రధాని ఏర్పాట్లు చేయడం ఏంటన్నారు. విశాఖ ఎంపి ఎంవి.వి. సత్యనారాయణ ఎక్కడా కనిపించడం లేదన్నారు. దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కూడా ఆలోచన చేయాలన్నారు. రుషికొండను ఏ విధంగా తవ్వేశారో, విశాఖను ఏ విధంగా దోచు కుంటున్నారో ప్రధాని దృష్టి తీసుకువెళ్లాలన్నారు. విశాఖలో రుషికొండను కాపాడాలని, దీనికోసం ప్రధాని మోడీ రుషికొండను పరిశీలించాలని ప్రధానికి రాసిన లేఖలో కోరినట్లు తెలిపారు. అమరావతి రాజధానికి ప్రధాని శంకుస్థాపన చేశారని, కానీ ముఖ్యమం త్రి జగన్మోహన్రెడ్డి రాజధానిని పక్కన పెట్టి రైతులకు అన్యాయం చేస్తున్నారని, దీనిపై ప్రధాని ఆలోచన చేసి అమరావతి రాజధాని పూర్తి చేసే బాధ్య త తీసుకోవాలని కోరారు. విశాఖపట్నాన్ని అభివద్ధి చేయాలని, ఉత్తరాంధ్రను దోపిడి చేస్తున్న విషయాన్ని గుర్తెరిగి న్యాయం చేయాలని కోరారు.