రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు
ప్రజాశక్తి - దేవనకొండ
దేవనకొండ ప్రధాన రహదారిపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసు స్టేషన్ సమీపంలోని మసీదు దగ్గర డ్రెయినేజీ కాలువ నిండిపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. ఆ రోడ్డుపై వెళ్లే వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మురుగునీటి దుర్వాసనతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి నిండిన మురుగు కాలువను శుభ్రం చేయించాలని కోరుతున్నారు.










