ప్రజాశక్తి-లీగల్ విలేకరి : శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ బదిలీపై వచ్చిన గుత్తుల గోపి విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వైద్యుల రవీంద్రబాబు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, బార్ కౌన్సిల్ మెంబర్ బైపా అరుణ్‌కుమార్, సీనియర్ న్యాయవాదులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ లాయర్లు బగాది తులసీదాస్, ఆర్.శ్రీనివాసరావు, కుప్పిలి మురళీధర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ కరుణశ్రీ, సిబ్బంది రమణి, రత్నం, శిరీష, సూర్య వెంకటలక్ష్మి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపిని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కెకెవి.బులి కృష్ణ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.










