Mar 14,2023 00:58
పర్చూరులో ఎమ్మెల్సీ ఎన్నికల సరళి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ఏలూరి

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు మండలంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సోమవారం పర్యటించారు. అడుసుమల్లికి చెందిన టిడిపి బాపట్ల పార్లమెంటరీ బిసి సెల్‌ కార్యదర్శి అన్నవరపు శ్రీనివాసరావు తండ్రి శంకర్రావు మృతదేహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మండలంలోని వీరన్నపాలేనికి చెందిన బండ్లమూడి రామనాథంబాబు మరణించగా ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. ఇదే గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త కోట వెంకన్న అనారోగ్యంతో ఉండటంతో ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పర్చూరు ఎమ్మెల్సీ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించి నాయకులు, కార్యకర్తలతో పోలింగ్‌ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు షేక్‌ షంషుద్దీన్‌, కె శివ, అప్పలనేని నరేంద్రకుమార్‌, ఎవి కృష్ణ, కారుమూడి కృష్ణారావు, అప్పలనేని వెంకటేశ్వర్లు, గోరంట్ల రామకృష్ణ, టిడిపి నాయకులు పాల్గొన్నారు.