Oct 26,2023 22:41

ప్రజాశక్తి-చల్లపల్లి : వచ్చే నెల 15న విజయవాడలో జరిగే ప్రచార భేరిని జయప్రదం చేయాలని చల్లపల్లి సిపిఎం మండల కార్యదర్శి యద్దనపూడి మధు ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక శ్రామిక గుంటూరు బాపనయ్య భవనంలో ప్రచార భేరి గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలంటే ప్రజల ఐక్యంగా కథలాలని మరో మహౌద్యమం కోసం సిపిఎం పార్టీ ప్రచార భేరి మోగిస్తుందని అందరూ కదలాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని విడగొట్టి పది సంవత్సరాలైనా ప్రత్యేక హౌదా, పోలవరం ప్రాజెక్ట్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ లాంటి హామీలలో ఏ ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే లేబర్‌కోడ్‌లను తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య, విద్య ప్రైవేటీకరణ చేయటం వలన సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి భారంగా. మారాయి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్పొరేట్‌ సేవలో తరిస్తూ గంగవరం మేజర్‌ పోర్టల్‌ తో పాటు రాష్ట్ర ప్రజల సంపదను ఒక్కొక్కటి కట్టపెడుతున్నారని అన్నారు. కౌలు రైతులకు గుర్తింపులు కార్డు లేక బ్యాంకు రుణాలు అందటం లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలంటే ప్రజల ఐకమత్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు నాయకులు చౌటపల్లి రవి, సిఐటియు మండల కార్యదర్శి మహమ్మద్‌ కరీముల్లా, సిపిఎం పార్టీ నాయకులు బండారు కోటేశ్వరరావు, మేడంకి వెంకటేశ్వర రావు, కలపాల దావీదు, బళ్లా వెంకటేశ్వరరావు, లంకపల్లి సత్యం,పెయింటర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.