కడప అర్బన్ మున్సిపల్ కార్మికులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ఎపి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నగర అధ్యక్షులు సుంకర రవి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రాష్ట్ర కమటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో సుంకర కిరణ్ అధ్యక్షతన కార్మికులు మోకాళ్ల పై కూర్చొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను, కార్మికులను, రెగ్యులర్ చేయాలనే ప్రదానం డిమాండ్ అన్నారు. కోవిడ్ -19 కార్మికులను ఆప్కాస్ లో చేర్చాలని, పిహెచ్ డ్రైవర్స్‌కి హెల్త్ అలవేన్స్ ఇవ్వాలని, అడిషనల్ కార్మికులకు పిఎఫ్, ఈఎస్‌ఐ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. క్లాప్ డ్రైవర్లకు రూ. 18500 వేతనం చెల్లించాలని, డ్రైవర్ల కు రూ.32500 ఇవాలని, ఎలక్ట్రిషన్ సిబ్బందికి స్కిల్డ్,సెమీ స్కీల్డ్ వేతనాలు ఇవ్వాలని పేర్కొన్నారు. తడిచెత్త పొడిచెత్త వేరు చేయించడం లో కార్మికులు తీవ్రంఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఎందుకంటే అందులో దైఫర్‌లు, ప్యాడ్‌లు, చాలా వస్తున్నాయని చెప్పారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చు కునేందుకు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించే వంట వార్పుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మున్సిపల్‌క ార్మికుల పట్ల మొండి వైఖరి వీడి ఇచ్చిన హామీలను నెరవే ర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డిసెంబర్ మొదటి వారంలో నిరవధిక సమ్మెకు కార్మికుల సిద్దమవుతామని హెచ్చరించారు. అప్పటికి అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్దపడతమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ గోపి, నాయకులు పుల్లయ్య, నాగరాజు, ఆనంద్, అదాం,శివ, మహిళకార్మికులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ సంక్షేమ సంఘం (సిఐటియు అనుబంధం) ప్రొద్దుటూరు శాఖ కార్యదర్శి సాల్మన్ కోరారు. రాష్ట్ర సంఘం పలుపుమేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు అర్థనగ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటమేరకు మున్సిపల్ కార్మికులనందరినీ పర్మినెంట్ చేయాలన్నారు. పనికితగ్గ వేతనం ఇవ్వాలన్నారు. నేటి ధరలకనుగుణంగా వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. ఆప్కాస్ రద్దు చేయాలన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు టెక్నికల్ వేతనాలు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. చనిపోయిన కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు సత్యనారాయణ, అధ్యక్షులు చంటి, ప్రమీలమ్మ, గుర్రమ్మ, రమాదేవి, నీతమ్మ, శాంతి, మోహన్, జాకోబు, సులోచన, కార్మికులు పాల్గొన్నారు.