Aug 12,2023 21:06

కలెక్టరేట్‌కు ర్యాలీగా వస్తున్న ఉపాధ్యాయులు

 

 ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు
ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ :  రాష్ట్ర ప్రభుత్వం దిగి రాక పోతే పెద్దఎత్తున పోరాటం చేస్తామని ప్యాప్టో రాష్ట్ర చైర్మన్‌ నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు శనివారం స్థానిక డిఇఒ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకూ ఉపాద్యాయులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద 12 గంటల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీవో 117 వల్ల ప్రభుత్వ పాఠశాలలు శ్మశాన వాటికలులా మిగిలాయిని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోతో భవిష్యత్తులో 18వేల పాఠశాలలు మూతపడతాయని, ప్రాథమిక పాఠశాల అనేది భవిష్యత్తులో ఉండదని హెచ్చరించారు. అలాగే ప్రవీణ్‌ ప్రకాష్‌ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా అనర్హుడన్నారు. రాష్ట్ర ప్యాప్టో పరిశీలకులు గణపతి మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దుచేసి మాట నిలబెట్టుకోవాలని అన్నారు. జిల్లా చైర్మన్‌ వి.ధనుంజయ నాయుడు ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలన్నీ చెల్లించాలన్నారు. ప్యాప్టో జిల్లా నాయకులు ఎస్‌.మురళీమోహన్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం చేయాలని, ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో రాష్ట్ర బాధ్యులు ధనుంజయ రావు, జిల్లా బాధ్యులు తోట రమేష్‌, పిసిహెచ్‌ శ్రీనివాసరావు, నల్ల బాలకష్ణ, గోవిందరావు, పైడిరాజు, అనిల్‌, జిల్లాలోని ఉపాధ్యాయులంతా పాల్గొన్నారు.