ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రి ముఖ ద్వారం వద్ద ఉన్న రోగులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రిలో మౌలిక వసతులను పరిశీలించిన ఆయన ఎక్సరే లేకపోవడం అసంతృప్తి వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.4.50 కోట్లకు పైగా నిధులు వెచ్చించి ఆసుపత్రిని బ్రహ్మాండంగా నిర్మించామ న్నారు. కానీ వైసిపి ప్రభుత్వంలో కట్లు కట్టేందుకు క్లాత్ సైతం లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రిలో నెలకొన్న అసౌకర్యాలపై ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసినట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా ఎక్స్‌రే మిషన్ ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే ందించి సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులను ఆయన ఆప్యాయంగా పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతలపాడుకు చెందిన భారతి, ముసలారెడ్డిలను పరామర్శించారు.
మైనారిటీ సెల్ నూతన కమిటీ సన్మానం
తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని పర్చూరు నియోజకవర్గ మైనారిటీ సెల్ నూతన అధ్యక్ష కార్యదర్శులు రసూల్, రియాజ్ బాషాలు ఎమ్మెల్యే ఏలూరికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులకు ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు తెలిపారు.










