కడప అర్బన్ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం చూపుతున్న నిరంకుశ మొండివైఖరి దుర్మార్గమని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఎస్‌టియు రాష్ట్ర మాజీప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఎస్‌టియు రాష్ట్ర సంఘ పిలుపు మేరకు శనివారం కలెక్టరేట్ ఎదుట జిల్లా శాఖ అధ్యక్షుడు పి.రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆక్రందన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతాలు, పెన్షన్లు ఎప్పుడు పడతాయో కూడా తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొనడం బాధాకరమన్నారు.
సకాలంలో జీతాలు అందక సగటు వేతనజీవులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావని చెప్పారు. ప్రతి నెలా జీతాల నుండి మినహాయించి పొదుపు చేసుకున్న జడ్‌పిఎఫ్, ఎపిజిఎల్‌ఐ లోన్లు, ఫౖనల్ పేమెంట్ల కోసం ,రఖాస్తు చేసుకుంటే, నెలల తరబడి చెల్లింపులు చేయక పోవడంతో ఉద్యోగులు పొదుపు చేసుకున్న సొమ్ముపై పలు అనుమానాలు నెలకొన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో జీతాలు, పిఆర్సీ, డిఏ తదితర బకాయిలు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం దీక్షను విమరించారు. కార్యక్రమంలో
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలగంగిరెడ్డి, దాదాపీర్, ఇలియాస్ బాషా, బాలరాజు, జిల్లా ప్రధానకార్యదర్శి వై.వెంకటసుబ్బయ్య,సీనియర్ నాయకులు జయరామయ్య, రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి,శీను, చంద్రహాసరెడ్డి,మల్లేశు,ప్రతాప్ రెడ్డి, జిల్లాకార్యవర్గ సభ్యులు శేఖర్ బాబు, విజయభాస్కర్,శివారెడ్డి, గురుప్రసాద్ తదితర జిల్లా ,మండల బాధ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.










