Nov 11,2023 23:39

కవిటి : ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

కవిటి: కూల్చివేతలతో ప్రారంభమైన వైసిపి ప్రభుత్వం కూలిపోయే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే బెందాలం అశోక్‌ జోస్యం చెప్పారు. మండలం బిజి పుట్టుగ గ్రామంలో శనివారం బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ నియంతృత్వ పోకడలతో సాగుతున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు రూ.100 చేతిలో పెట్టి ట్రు అప్‌ చార్జీల పేరుతో నెలకు రూ.500 దోచుకుంటోందని ఎద్దేవా చేశారు. అనంతరం గ్రామంలో కలియ తిరుగుతూ రైతాంగ, మధ్యతరగతి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలు వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పొందల కృష్ణారావు, బెందాలం రమేష్‌, మణి చంద్ర ప్రకాష్‌, సంతోష్‌ పట్నాయక్‌, బాసుదేవ్‌ రౌలో, బార్ల చినబాబు, శమళ్ల సర్వేసం, పూడి రామారావు పాల్గొన్నారు.
లావేరు: మాజీ నారాచంద్రబాబునాయుడు తోనే ప్రజలు భవిష్యత్‌ కు గ్యారంటీ ఉంటుందని లావేరు మండల టీడీపీ క్లస్టర్‌ ఇంచార్జి గొర్లె శ్రీనువాసురావు అన్నారు శనివారం తామాడ పంచాయతీ కొత్తరౌతుపేటలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి క్లస్టర్‌ ఇన్‌ఛార్జి గొర్లె శ్రీనువాసరావు పాల్గొని ఇంటింటా టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌ఛార్జి మజ్జి రామమూర్తి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: మేజరు పంచాయతీ నాయీబ్రాహ్మణుల వీధిలో ఇంటింటికి వెళ్లి బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ బాండ్లను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బిసి సాధికారిత కార్యదర్శి బోయిన గోవిందరాజు, టిడిపి నాయకులు నౌగాపు నాగరాజు, కమ్మకట్టు అప్పలరాజురెడ్డి, కోరాడ గోవింద, సకాలభక్తుల రాంకుమార్‌, కోరాడ చిన్న గోవింద, అను పాల్గొన్నారు. అలాగే మండలం హరిశ్చంద్రపురం పంచాయతీలో మాజీ ఎంపిటిసి హనుమంతు అప్పలరాజు, చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడులో మాజీ సర్పంచ్‌ గొండు లక్ష్మణరావు ఆధ్వర్యంలో భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.