May 20,2023 22:45

వాలంటీర్లను సత్కరిస్తున్న ఎంపిపి రాయుడు సునీత, ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి - తాళ్లరేవు
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వాలంటీర్లు పనిచేయాలని ఎంపిపి రాయుడు సునీత గంగాధర్‌ అన్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్ర మంలో భాగంగా చొల్లంగి, చొల్లంగిపేట పంచాయతీలలో ఉత్తమ వాలం టీర్లను దుశ్శాలువ, పూలమాలతో ఆమె సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చొల్లంగి నాయకులు బూరెల వెంకటరాజు, శివాజీ గణేష్‌లు, చొల్లంగిగిపేటలో కందిళ్ల గంగ బాబు, కడియాల శ్రీనివాస్‌లు వాలంటీర్లను అభినందించారు. రెండు పంచాయతీలలో సుమారు 40 మంది వాలంటీర్లను సత్కరించారు. కార్యక్రమంలో ఎంపి డిఒ ఎం.అనుపమ, వైసిపి మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్‌, ఉప సర్పంచ్‌ స్వర్ణ రాజు, ఇఒపిఆర్‌డి మల్లాడి భైరవమూర్తి, పంచాయతీ కార్యదర్శి పోతాబత్తుల శ్రీనివాస్‌, ఎం.శ్రీనివాస్‌,కె. శ్రీదేవి, సూర్యకుమారి, నూకరాజు, సచివాలయ, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.