ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ధరల పెరుగుదలకు కారణమని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, నిత్యావసర ధరలు, పన్నుల భారానికి వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సమరభేరిలో భాగంగా సోమవారం పల్నాడు జిల్లా వ్యాప్తంగా పలు తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి వినతిపత్రాలు ఇచ్చారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావు పేటలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో విజరుకుమార్ మాట్లాడారు. జీఎస్టీ ద్వారా ధరలను అదుపు చేస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడేం చేస్తోందని ప్రశ్నించారు. జీఎస్టీ అమలైతే 25 శాతమే పన్నులుంటాయని చెప్పి ప్రస్తుతం 58 శాతం వరకూ వేసి ప్రజలను దోపిడీ చేస్తున్నారన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్ ధర రూ.450 ఉండగా దాన్ని రూ.1200కు పెంచి ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కారనంగా రూ.200 తగ్గిం చారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీని బిజెపి విస్మరిం చిందని, రైల్వే శాఖలో 4.50 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నట్లు పార్లమెంట్లో రైల్వే శాఖ మంత్రి సమాధానమిచ్చారని, అయినా వాటిని భర్తీ చేయడం లేదని అన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 4 శాతం ఉన్న నిరుద్యోగం 9 శాతానికి పెరిగిందని, నిరుద్యో గులను ఆ పార్టీ తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు. మరోవైపు ప్రజల్లో మతోన్మా దాన్ని రెచ్చగొడుతోందని మండిప డ్డారు. ప్రజలపై దారుణంగా భారాలేస్తున్న బిజెపికి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ప్రశ్నించా లన్నారు. రాష్ట్రంలో వైసిపి సైతం ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిందని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదని నెలనెలా ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ పొందుతున్నా ఖాళీలను భర్తీ చేయడం లేదని విమర్శించారు. ప్రజలకు కష్టాలు, నష్టాలు తెచ్చిపెడుతున్న విధానాలపై పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో సూపరిం టెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చారు. సిపిఎం జిల్లా నాయకులు డి.శివకుమారి, పట్టణ కార్యదర్శి షేక్ సిలార్ మసూద్, నాయకులు ఖాసీం, కె.ఆంజనేయులు, రబ్బాని, సుభాష్ చంద్రబోస్, సుభాని, కరిముల్లా, రసూల్, గోపీచంద్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు మాట్లాడారు. అనంతరం తహశీల్దార్ చక్రవర్తికి వినతి పత్రం ఇచ్చారు. నాయకులు టి.శ్రీనివాసరావు, బి.నాగేశ్వరరావు, కోటిరెడ్డి, షేక్ హిమాంబి, కవిరేశ్వరమ్మ, ఎన్.ఆదెమ్మ, జానీ, మాధవి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మాచవరం : తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో ఏపూరి గోపాలరావు మాట్లాడారు. అనంతరం తహశీల్దార్ ప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు. లాల్‌హ్మద్, మస్తాన్‌వలి జిన్నాబి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మాచర్ల : తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.ఆంజనేయులు నాయక్ మాట్లాడారు. బి.మహేష్, వై.సురేష్, వెంకటరత్నం, శోభన్ కుమార్, వి.వెంకట్రావు, జ్యోతిష్‌రాజు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : పట్టణంలోని 1, 21 వార్డుల సచివాలయాల్లో వినతిపత్రాలు ఇచ్చారు. సిపిఎం నాయకులు అవ్వారు ప్రసాద్‌రావు మాట్లాడారు. కె.శివదుర్గారావు, జె.రాజకమార్, బి.కొండలు, కె.ఆంజనేయులు, బి.పానకాలు, జి.శ్రీనివాసరావు, జి.ఏసురత్నం పాల్గొన్నారు.
ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : మండలంలోని రెంటపాళ్ల సచివాలయంలో కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చారు. సిపిఎం మండల కార్యదర్శి పి.మహేష్ మాట్లాడారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించే ధర్నాలో ప్రజలు పాల్గొనాలని కోరారు. నాయకులు ఎం.నరసింహారావు, బి.రామారావు, డి.మేరమ్మ, జె.అనూష, డి.ప్రశా ంతి, డి.అమూల్య, బి.కోటమ్మ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - అచ్చంపేట : తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహశీల్దార్ సిహెచ్ పద్మాదేవికి వినతిపత్రం ఇచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సబ్యులు జి.రవిబాబు మాట్లాడారు. నాయకులు ఆర్.వెంకటేశ్వర్లు, షేక్ హసన్, పంచాయతి కార్మికులు, విఆర్‌ఎలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - చిలకలూరిపేట : తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో సిపిఎం పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ రవికుమార్‌కు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఎస్.బాబు, పి.భారతి, ఎం.విల్సన్, కె.రోశయ్య, టి.ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - యడ్లపాడు : స్థానిక పోపూరి విజ్ఞాన కేంద్రం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన చేశారు. అనంతరం ధర్నా చేసి అధికారికి వినతిపత్రం ఇచ్చారు. సిపిఎం మండల కన్వీనర్ టి.కోటేశ్వరరావు మాట్లాడారు. కె.రోశయ్య, జె.శంకరరావు, పి.సుబ్బారావు, ఎం.సీతారా మయ్య, గురుస్వామి, వై.పుల్లయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ముప్పాళ్ల : తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో సిపిఎం మండల కార్యదర్శి జి.బాలకృష్ణ మాట్లాడారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు ఎం.వెంకటరెడ్డి, టి.అమరలింగేశ్వరరావు, సిహెచ్.నాగమల్లేశ్వరరావు, జి.జాలయ్య, పి.సైదాఖాన్, కె.నాగేశ్వరావు, ఐ.సత్యనారాయణరెడ్డి, జి.నరసింహారావు, ఐ.వెంకటరెడ్డి, టి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు
ప్రజాశక్తి-పెదకూరపాడు : తహశీల్దార్ క్షమారాణికి వినతిపత్రం ఇచ్చారు. నాయకులు వి.మాబు, నాగేశ్వరావు, శివ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - బెల్లంకొండ : తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతిపత్రం ఇచ్చారు. సిపిఎం మండల కార్యదర్శి సిహెచ్ పుల్లారావు మాట్లాడారు. నాయకులు బి.నరసింహారెడ్డి, సైదయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి - అమరావతి : తహశీల్దార్ విజయశ్రీ వినతిపత్రం ఇచ్చారు. సిపిఎం మండల కార్యదర్శి బి.సూరి బాబు, మొహిద్దిన్‌వలి, ఎస్.రాజ్‌కుమార్, రఫీ, నాగుల్ మీరా, రాజు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - క్రోసూరు : తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు మాట్లాడారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. సిపిఎం మండల కార్యదర్శి టి.హనుమంతరావు, సిహెచ్.ఏషియా, జి.చిన్నప్ప పాల్గొన్నారు.
ప్రజాశక్తి - వినుకొండ : బొల్లాపల్లి, వినుకొండ మండలాల్లో ప్రచారం నిర్వహించారు. వినుకొండ మండలం విఠంరాజుపల్లి, బ్రాహ్మణపల్లి, నరగాయపాలెం, జాలలపాలెం, వెంకుపాలెం, చీకటిగలపాలెం, శివాపురం, నడిగడ్డ, కొప్పుకొండ, గణేశునిపాలెం, నీలగంగవరం, కొత్తపాలెం, పార్వతీ పురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలపై సచివాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చారు. విఠంరాజుపల్లిలో ఆసుపత్రి స్థలంలో సచివాలయం నిర్మాణం సరికాదని నాయకులు కె.హనుమంతరెడ్డి అన్నారు. వీరపనేని నగర్ వాసులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. జలలపాలెం వెంకుపాలెం గ్రామాల వద్ద భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కొప్పుకొండ భూములను, గణేష్‌పాలెంలో మిగిలిన 250 ఎకరాల ప్రభుత్వ భూములను పేదలకు పంచాలన్నారు. బొల్లాపల్లి మండలం ముగచింతలపాలెం, గంగుపాలెం, బొల్లాపల్లి, బండ్లమొట్టు, రేమి డిచర్ల, అయ్యన్నపాలెం, గరికపాడు, పమిడి పాడు, మేళ్లవాగు, రెడ్డిపాలెం, బిఎల్ కాలనీ, లాలీపురం, రాజానాయక్‌తండా, చక్రాయ పాలెం, హనుమాపురం, మర్రిపాలెం, మేకల దిన్నే, గండిగనుమల, రావులాపురం తదితర గ్రామాల్లో ప్రచారం సాగింది. వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మించాలని నాయకులు కోరారు. శివరామకష్ణ, నాసర్ బి పాల్గొన్నారు.










