నకరికల్లు: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యుత్ రంగంలో పెనుమార్పులు చేసి వినియోగదారు లను ఇబ్బందులకు గురిచేస్తోందని పల్నాడు జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు గుంటూరు విజరుకుమార్ అన్నారు. స్థానిక భగత్‌సింగ్ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం మంగళవారం నిర్వహించారు. విజరుకుమార్ మాట్లాడుతూ ధరల పెరుగు దల, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక పోవడానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫ ల్యమని విమర్శించారు. కౌలు రైతులకు యజమాని సంతకం లేకుండా గుర్తింపుకార్డు అందజేయాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. కర్షక, కార్మిక వర్గాలు చేసే పోరాటాలలో సిపిఎం మద్దతు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి జి. పిచ్చా రావు, రైతు సంఘం మండల కార్య దర్శి ఇ.అప్పిరెడ్డి, పిడిఎమ్ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్‌వలి, వి.రవినాయక్, జి.కుమారి, చిన్న గురు, బాల, సిహెచ్ కోటేశ్వరరావు, షేక్ సైదా, కోటా నాయక్ పాల్గొన్నారు.










