పులివెందుల రూరల్ : పులివెందుల మోడల్ టౌన్‌లో భాగంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించిన మెటీరియల్ (వస్తువులు)ను కొందరు ఆకతాయిలు అమ్ముకుంటున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి వినోద్‌కుమార్ తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి మంగళవారం కలెక్టర్ విజరురామరాజు అభివృద్ధి పనులపై సమీక్షాసమావేశం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్టర్లు పనుల మెటీరియల్ చోరీకి గురవుతోందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఆ మేరకు పలువురు గుజిరి షాప్ యజమానులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. కార్య క్రమంలో మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి, పులివెందుల అర్బన్ ఎస్‌ఐలు, హుస్సేన్, సత్య నారాయణ పాల్గొన్నారు.










