Aug 30,2022 23:13

ఇంటింటికీ ప్రచారం చేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి -కంచరపాలెం : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల సామాన్యుల బతకడం భారంగా మారిందని సిపిఎం మాజీ కార్పొరేటర్‌ బొట్టా ఈశ్వరమ్మ చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడానికి ఆమె మంగళవారం 57వ వార్డు లోని సుభాష్‌నగర్‌లో ఆ పార్టీ సభ్యులు సులోచన ఆధ్వర్యాన ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఈశ్వరమ్మ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం గ్యాస్‌ ధరలను పెంచడంతో సామాన్యులు బండ కొనుక్కోలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో రెండు ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మహిళా సభ్యులు సులోచన, పుష్ప, స్థానిక మహిళలు, లక్ష్మి, శివ, లలిత పాల్గొన్నారు.