Nov 05,2023 21:28

ఫొటో : మాట్లాడుతున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రభుత్వ విధానాలను మార్చాలి : యుటిఎఫ్‌
ప్రజాశక్తి-వరికుంటపాడు : ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని జిల్లా యుటిఎఫ్‌ అధ్యక్షులు వి వి శేషులు, ప్రధాన కార్యదర్శి జి వి చలపతి శర్మ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వరికుంటపాడు యుటిఎఫ్‌ మండల కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని పిఆర్‌సి బకాయిలను డిఎ అరియర్స్‌ వెంటనే చెల్లించాలన్నారు. ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న పాఠశాల విలీనాన్ని పునపరిశీలించాలని డిమాండ్‌ చేశారు. ప్రతినెలా ఒకటో తేదీ జీతాలు లేకపోవడంతో ఇంటి లోన్‌ తీసుకున్న ఉద్యోగులు బ్యాంకులోన్‌ ఇఎంఐ కట్టలేక ప్రతినెలా పెనాల్టీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అలాగే సిబిల్‌ పాయింట్స్‌ తగ్గడం మళ్లీ లోనుకు పోతే వాళ్లు తిరస్కరించడం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే ప్రతినెలా సక్రమంగా జీతాలు చెల్లించాలని కోరారు. జిల్లా, మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో ఎన్నికల ప్రధాన అధికారిగా తిరుపతయ్య పాల్గొని ఎన్నిక నిర్వహించారు. మండల కమిటీ గౌరవాధ్యక్షులుగా పి.వెంకటేశ్వర్లు, అధ్యక్షులుగా ఎల్‌ వినారాయణ, సహధ్యక్షులుగా పి.రాధాకృష్ణ, డి.రమణయ్య, ఎస్‌.నిర్మల, ప్రధాన కార్యదర్శి వి వి సుబ్రహ్మణ్యం, కోశాధికారి డి.చంద్రమౌళి, మహిళాకన్వీనర్‌ ఆర్‌.భవాని, కోకన్వీనర్‌ కె.భువనేశ్వరి, జిల్లా కౌన్సిల్లర్‌ కె.చంద్రశేఖర్‌ రెడ్డి, ఎస్‌కె.కరీముల్లా, జి.హజరత్‌, ఆర్‌.నాగార్జున, ఎస్‌ హెచ్‌ ప్రసాద్‌, కె వి కాంతారావు, డి.వెంకటేశ్వరరావు, కె.హేమలతలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు చంద్రశేఖర్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి బాల రాగయ్య, జిల్లా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు మండలంలోని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.