ప్రత్యామ్నాయ విధానాలతోనే సమస్యకు
పరిష్కారం
ఉపాధి కల్పనలో కేరళ దేశానికే ఆదర్శం
రాష్ట్ర స్థాయి నిరుద్యోగ సదస్సులో సిపిఎం రాష్ట్ర
కార్యదర్శి శ్రీనివాసరావు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే నిరుద్యోగం పెరిగిపోయిందని సిపిఎం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో హోటల్ రివర్‌బేలో బుధవారం నిరుద్యోగ రాష్ట్ర సదస్సు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ సభికులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సదస్సుకు వి.శ్రీనివాసరావు ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటు, యువతలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీలతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను పూర్తిగా బుట్టదాఖలు చేశాయన్నారు. పరిశ్రమల ఏర్పాటు సెజ్‌లు అంటూ రైతుల నుంచి సేకరించిన భూములను తాకట్టు పెట్టుకుని కార్పొరేట్ సంస్థల యజమానులు బ్యాంకుల ద్వారా లబ్ధి పొంది ప్రజల సొమ్మును లూఠీ చేస్తున్నారని విమర్శించారు. అటువంటి అవినీతిపరులకు కేంద్ర ప్రభుత్వం ఆశ్రయమిస్తోందన్నారు. దేశంలోనే అత్యధిక నిరుద్యోగం రాష్ట్రంలో ఉందన్నారు. ఈ పరిస్థితులలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గు ఊచేటన్నారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పెంపుతో చిరుపరిశ్రమలు మూతపడుతున్నాయని, ఫలితంగా ఉన్న కొద్ది పాటి ఉపాధికి యువత దూరమవుతుందన్నారు. ఆర్థిక సంక్షోభంతో భారీ పరిశ్రమలు సైతం ఇటీవల ఉద్యోగులను తొలగిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పట్టభద్రులు దిక్కుతోచని స్థితిలో మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్చడుతున్నారని తెలిపారు. ఉపాధి కల్పనలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం దేశానికే ఆదర్శమని వివరించారు. చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుందన్నారు. ఎంఎల్‌సి కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్రం ఇప్పటికైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం గ్రంథాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. నియోజక వర్గానికి ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. పిడిఎఫ్ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్న బిజెపి ప్రభుత్వానికి వైసిపి ప్రభుత్వం వంత పాడుతుందన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించకుండా రాజకీయ అస్త్రంగా మార్చుతున్న పాలక ప్రభుత్వాలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. యువజన పోరాటాలకు పిడిఎఫ్ ఎంఎల్‌సిల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు హరికిషోర్, డివైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, అధ్యక్షులు ప్రసన్న, శ్రామిక మహిళా సంఘం నాయకులు డి.రమాదేవి, ఎం.నాగమణి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.తులసి, సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్, డాక్టర్ చైతన్యశేఖర్, సిపిఎం జిల్లాకమిటీ సభ్యులు బి.రాజులోవ, పి.తులసి, జువ్వల రాంబాబు, ఎం.సుందరబాబు, ఎన్.రాజా, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి నిరుద్యోగులు పాల్గొన్నారు.
19 తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం
సదస్సులో డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న 19 తీర్మానాలను ప్రవేశ పెట్టారు. దీన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.
ొ మెగా డిఎస్‌సిని ప్రకటించి 40 వేల ఉపాధ్యాయ పోస్టులు పిఇటిలతో కలిపి భర్తీ చేయాలి. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్‌సిని నిర్వహించాలి.
ొ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9.64లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.35 లక్షల పోస్టులను భర్తీచేయాలి.
ొ ఆంధ్రప్రదేశ్ నూతన యూత్ పాలసీని ప్రకటించాలి.
ొ 5వేల పోస్టులతో గ్రూప్ 1, 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి.
ొ రాష్ట్రంలో ఐటి, సినీ పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగ కల్పన జిఒను అమలు చేయాలి.
ొ పే అండ్ ప్లే విధానాన్ని రద్దు చేసి క్రీడా రంగంలో శాశ్వత ప్రాతిపదికన కోచ్‌లను నియమించాలి. ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ చేయాలి
ొ పశుసంవర్ధక శాఖలో, గ్రంథాలయ శాఖలో పోస్టులు భర్తీ చేయాలి.
ొ గ్రంథాలయాల్లో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని నియమించాలి.
ొ ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలి
ొ ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి
ొ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సహా అన్ని రకాల నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి
ొ ప్రయివేటీకరణ విధానాలు విడనాడాలి. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలి. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించి అభివృద్ధి చేయాలి. కడప ఉక్కును ప్రారంభించాలి.
ొ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ, ఫైర్, జైలు వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలి
ొ ప్రతి మండల కేంద్రంలో స్కిల్ డెవలెప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి టిటిడిలో ఖాళీగా ఉన్న 9,500 పోస్టులను భర్తీ చేయాలి
ొ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు స్టడీ సర్కిల్స్ వసతి, స్టయిఫండ్స్ ఏర్పాటు చేయాలి
ొ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు వచ్చేవరకు పుస్తకాలు, పరీక్ష రుసుం వగైరా వంటి ఖర్చులకు నెలకు రూ.5వేలు నిరుద్యోగ భృతి చెల్లించాలి
ొ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఉచిత స్టడీ మెటీరియల్ ఇవ్వాలి
ొ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం బ్యాంకుతో సంబంధం లేకుండా అర్హత కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి.










