ప్రజాశక్తి -నక్కపల్లి: కేంద్రం ప్రవేశపెట్టిన విద్యా బడ్జెట్ 2023-24 కార్పొరేట్ విద్యాసంస్థల ప్రయోజనాలకు దోహదపడుతుందని ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేయాలనే ఉద్ధేశ్యంతో రూపొందించినట్లు గా ఉందని అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు బి.బాబ్జి విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక సిఐటియు కార్యాలయంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం లో ఆయన మాట్లాడారు. నిధుల కేటాయింపులను తగ్గించారని విమర్శించారు. గత బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎంత ఖర్చు చేశారన్న దానిపై కూడా ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాలని బడ్జెట్‌లో పెట్టిన నిబంధన విద్య ప్రైవేటీకరణ, వ్యాపారీకరణకు గేటును తెరుస్తుందని ఆరోపించారు. విద్యా రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించే ప్రణాళికను ఈ బడ్జెట్ ప్రతిభింబిస్తుందన్నారు. బడ్జెట్ ను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ప్రభుత్వ విద్యను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఉన్న కేంద్రానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సింహాద్రి, శ్రీను పాల్గొన్నారు.










