Aug 24,2023 21:14

స్కూటర్‌యాత్ర పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

కడప అర్బన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, జిల్లాలో విద్యారంగ అభివద్ధి కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టనున్న 'విద్యార్థి సంగ్రామ స్కూటర్‌ యాత్ర' ను జయప్రదం చేయాలని మాజీ విద్యార్థి నాయకులు జి.చంద్ర శేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శి మనోహర్‌ పిలుపునిచ్చారు. గురు వారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో యాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ విద్యారంగ అభివద్ధి కోసం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 350 కిలోమీటర్ల పాటు నిర్వహించనున్న స్కూటర్‌ యాత్ర ను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. యాత్ర ఒంటిమిట్ట లో ప్రారంభమై భాకరపేట, సిద్దవటం, అట్లూరు, బద్వేలు, పోరుమామిళ్ల, కలసపాడు, బి.మఠం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, పులివెందుల, వెంపల్లి, వైవీయూ మీదుగా ఈ నెల 31న కడపకు చేరుకుని యాత్ర ముగుస్తుందన్నారు. ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించనున్న స్కూటర్‌ యాత్రను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గండి సునిల్‌ కుమార్‌, సగిలి రాజేంద్ర ప్రసాద్‌, మాజీ విద్యార్థి నాయకులు అన్వేష్‌, లక్ష్మీదేవి, జిల్లా కమిటీ సభ్యులు సురేష్‌ నాయక్‌, నాయకులు ఉదరు పాల్గొన్నారు.