Sep 21,2023 21:37

ప్రచారజాతాలో మాట్లాడుతున్న యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-పెనుకొండ : ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందామని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చా రు. యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాతా గురువారం పట్టణానికి చేరుకుంది. స్థానిక వై జంక్షన్‌ వద్ద జాతాకు యుటిఎఫ్‌ జిల్లా, స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద ఎన్‌.వెంకటే శ్వర్లు మాట్లాడుతూ 'ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం-ప్రభుత్వ పెన్షన్‌ని రక్షించుకుందాం' నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ ఐక్యపాధ్యాయ ఫెడరేషన్‌(యుటిఎఫ్‌)ను స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జాతాలు ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యాన్ని ఉపాధ్యా యులు తీసుకోవాలని కోరారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర సహాధ్యక్షులు కె.సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కార్పొరేట్లకు లాభం చేకూర్చే జిపిఎస్‌ విధానాన్ని బలవంతంగా అమలు చేసే ప్రయత్నం చేస్తుందని, తద్వారా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒపిఎస్‌ను తప్ప మరే పెన్షన్‌ స్కీంను యుటిఎఫ్‌ అంగీకరించదని, అవసరమైతే ఐక్య ఉద్యమాలకు సిద్ధపడతామన్నారు. అంతకుముందు హిందూపురం సీనియర్‌ నాయకులు వెంకటేశ్వరరావు జెండాను ఆవిష్కరించి, ప్రచారజాతా ప్రారంభ సూచికగా బెలూన్లు, తారాజువ్వలు, పావురాలను ఎగురవేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జయచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్‌, గౌరవాధ్యక్షులు భూతన్న, రాష్ట్ర కార్యదర్శి కొటేశ్వరప్ప, కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులు నారాయణస్వామి, తాహిర్‌వలి, శివశంకర్‌, నాయకులు నాగేంద్ర, రమేష్‌, కృష్ణానాయక్‌, నరేష్‌, సోమశేఖర్‌, నబి, రామకృష్ణనాయక్‌, ఉపేంద్ర, ఆదిజినేష్‌, గాయత్రి, లావణ్య, గౌరమ్మ, జావీద్‌, నరసింహులు, పెద్దిరాజు, జనార్ధన్‌, తదితరులు పాల్గొన్నారు.