ప్రభుత్వ విద్యా రంగం నిర్వీర్యం యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్
కడప అర్బన్ : పాలకులు సంస్కరణల పేరుతో విద్యారంగంలో వినాశకర విధానాలు అమలు చేస్తు న్నారని యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ చెప్పారు. శుక్రవారం యుటిఎఫ్ భవన్‌లో జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అమలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 117 వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది పాఠశాలలో మూసివేతకు గురయ్యాయని, 11 వేల ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రయత్ని స్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యా యుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అందులో భాగంగానే ఉపాధ్యాయుల ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. జూన్‌లో ఉపాధ్యాయ బదిలీలు జరిగాయని, అప్పటి నుంచి క్యాడర్ స్ట్రెంత్ ఆప్డేషన్ పేరుతో 250 మంది ఉపాధ్యాయులకు ఐదు నెలలుగా జీతాల చెల్లింపులు లేవన్నారు. మునిసిపల్ ఉపాధా ్యయులను విద్యాశాఖ పరిధిలోకి తెచ్చి ఏడాది కాలం ముగిసినా ఇప్పటివరకు వారి సర్వీసును విద్యాశాఖ నిర్ధారించలేదన్నారు. దీంతో మునిసిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జరగలేదన్నారు. గతంలో ఉన్న సర్వీస్ రూల్స్‌ను అమలు చేసైనా అవసరమైన స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయ పోస్టులను సష్టించాలన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు రేషనలైజేషన్ నిర్వ హించి వెంటనే బదిలీలు, ఉద్యోగోన్నతలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మునిసిపల్ కమిషనర్ల వద్ద ఉన్న తమ పిఎఫ్ సొమ్మును సైతం డ్రా చేసుకోలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ వెంటనే స్పందించి మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డిసెంబర్ మాసంలో తగు కార్యాచరణ రూపొందించి ఆందోళన చేపడుతామని హెచ్చ రించారు. డిసెంబర్ 9,10 తేదీలలో ఏలూరు జిల్లాలో యుటిఎఫ్ 49వ రాష్ట్ర కౌన్సిల్ సమా వేశాలు నిర్వహించనున్నారని, ఇందులో విద్యా రంగంలో పాలకులు చేపట్టిన సంస్కరణలపై చర్చి స్తామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీగా ఇచ్చిన సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ అమలు విధానంపై మాట తప్పి జిపిఎస్ విధానాన్ని అమలు చేయడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ధ్యేయంగా కార్యాచరణ రూపొందించి పోరుబాటుకు పిలుపునిస్తామని ఆయన తెలిపారు. యుటిఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించామని అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిం చడంతోపాటు సామాజిక అభివద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్, పాలెం మహేష్ బాబు, సహాధ్యక్షుడు వై.రవికుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్.ఓబుల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.