Mar 12,2023 01:34
మాట్లాడుతున్న గూడపాటి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-రేపల్లె: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు అన్నారు. రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయా మున్సిపల్‌ వార్డుల క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు, యూనిట్‌ సభ్యులతో సమీక్ష సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి వార్డులో 'ఇదేమి కర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. యువగలం పాదయాత్ర పేరుతో లోకేష్‌ నిర్వహిస్తున్న పాదయాత్ర 50 రోజులు 500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఆయా వార్డుల ఇన్‌ఛార్జులు, అధ్యక్ష కార్యదర్శులు ఓటర్ల జాబితాను వెరిఫికేషన్‌ చేసి చేర్పులు మార్పులు పార్టీ కార్యా లయానికి సమగ్రంగా నివేదిక అందజేయాలని కార్యాలయ ఇన్‌ఛార్జి జీవి నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో జీపి రామారావు, కౌన్సిలర్‌ అన్నే రామకష్ణ, వెనిగళ్ల శివ సుబ్రహ్మణ్యం, కవిత్వం శివ, దేవగిరి రవిశంకర్‌, గోగినేని శ్రీనివాసరావు, దున్న జయప్రద, మోర్ల అరుణకుమారి, తాడిపత్రి మల్లికార్జునరావు, యలవర్తి శ్రీలక్ష్మి, ఆయా వార్డుల ఇన్‌ఛార్జులు, అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.