Oct 18,2023 23:41

 మంగళగిరి: శిధిలావస్థకు చేరిన మంగళగిరి ప్రభుత్వ వైద్యశాల స్థానంలో రూ.12 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మా ణానికి ప్రతిపాదనలు తయారు చేసి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో కలిసి సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కృష్ణబాబుకు అందజేస్తామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.మంగళగిరి ప్రభుత్వ వైద్య శాలలో ఎక్స్‌ రే పరికరం చెడిపోయిందని గత 20 ఏళ్లుగా మరమ్మతులకు నోచు కోవడం లేదంటూ సోషల్‌ మీడి యాలో వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే స్పందించారు. ప్రభుత్వ వైద్యశాలలోని ఓ ఛాంబర్‌ లో ఉన్న ఎక్స్‌-రే పరికరాన్ని బుధ వారం పరిశీలించారు. అంతర్గత రహదారులను సంద ర్శించి ఆసుపత్రి అభివృద్ధిపై వైద్యులతో చర్చించారు. వైద్య శాలలో నూతన ఎక్స్‌ రే పరికరం కొనుగోలుకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వం నుండి ఆమోదం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, మాజీ మంత్రి ఎంఎస్‌ఎస్‌ కోటేశ్వరరావు హయాంలో 1986లో నిర్మించిన ప్రభుత్వ వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరిందని, దీనిని కూల్చివేసి నూతన భవన నిర్మాణానికి తగు చర్యలు తీసు కుంటానని హామీ ఇచ్చారు. నూతన ఎక్స్‌-రే యంత్రం కొను గోలుకు రూ.30 నుండి రూ.40 లక్షలు అవసరమని, ఇందుకు ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకొస్తామని చెప్పారు.
మార్చురీ బాక్స్‌ కోసం రూ.50 వేలు ఇచ్చిన ఎమ్మెల్యే
డిఎంఇ పరిధిలో ఉన్న ఈ వైద్యశాలలో మార్చురీ బాక్స్‌ లేదని, అంతర్గత రహదారులు లేవని, లైట్లు లేవని, చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని పలు మార్లు ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ స్పందన లేదని, ఆసు పత్రికి అభివృద్ధి కమిటీ కూడా లేదని ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్‌ గీతా పద్మజ ఎమ్మెల్యేకు వివరించారు. వెంటనే స్పం దించిన ఎమ్మెల్యే మార్చురీ బాక్స్‌ కొనుగోలుకు రూ.50 వేల నగదును అందజేశారు. ఆసుపత్రి ముఖద్వారం నుండి ఒపి ఛాంబర్‌ వరకు, అక్కడి నుండి మార్చురీ వరకు సిసి రోడ్డు నిర్మాణం చేయాలని, వెంటనే పనులను ప్రారంభించా లని కార్పొరేషన్‌ డిఇ కృష్ణారెడ్డికి సూచించారు. ఆస్పత్రిలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేయించాలని, పొక్లెయిన్‌తో పనులు ప్రారంభిం చాలని, మొత్తం 5 సోలార్‌ లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పా రు. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మా ణానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంపై డాక్టర్‌ గీతా పద్మజ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గంజి చిరంజీవి, డాక్టర్‌ స్నేహ రాజ్‌ పాల్గొన్నారు.
మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే తెనాలి రోడ్డు విస్తరణ
గత 2006లో ఉడా రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే తెనాలి రోడ్డు విస్తరణ చేపట్టడం జరుగుతుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే రామ కృష్ణారెడ్డి కోరారు. ఎమ్మెల్సీ హనుమంతరావుతో పాటు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఎమ్మెల్యే బుధవారం తెనాలి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ నగరంలోని రాజీవ్‌ సెంటర్‌ నుంచి మిద్దె సెంటర్‌ వరకు 60 అడుగులు, మిద్దె సెంటర్‌ నుంచి గౌతమ బుద్ధా రోడ్డు వరకు 40 అడుగులుగా మాస్టర్‌ ప్లాన్‌ లో ఉందన్నారు. కార్పొరేషన్‌కు భారం లేకుండా ప్రజలకు ఇబ్బందిగా కలగకుండా తెనాలి రోడ్డును విస్తరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్‌, ఆప్కో మాజీ చైర్మన్‌ గంజి చిరంజీవి, ఏసీపీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.