Sep 30,2023 00:01

ప్రభుత్వ ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎంఇవో

ప్రభుత్వ ఉపకరణాలను

సద్వినియోగం చేసుకోవాలి: ఎంఇవో
ప్రజాశక్తి- పలమనేరు: దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న ఉపకారణాలను సద్వినియోగం చేసుకో వాలని మండల విద్యాశాఖ అధికారి లీలారాణి తెలిపారు. శుక్రవారం మండల భవిత కేంద్రంలో దివ్యాంగుల పిల్లలకు ప్రత్యేక వైద్య శిబిరం సర్వ శిక్ష అభియాన్‌ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు అనిల్‌ కుమార్‌ యుగంధర్‌ దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన ఉపకరణాలను ఎంపిక చేశారు. ఈ వైద్య శిబిరానికి 48 మంది దివ్యాంగ పిల్లలు తల్లిదండ్రులు హాజరయ్యారు. ఎంపికైన దివ్యాంగులకు వీల్‌ చైర్స్‌ 16 ట్రై సైకిల్స్‌ ఒకటి,సీపీ చైర్స్‌ 1, వినికిడి యంత్రాలు 13,టి ఎల్‌ ఎం కిట్స్‌ 16 లు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జేఈఆర్పిలు, సి ఆర్‌ పి లు, ఎంఎస్‌ఐలు పాల్గొన్నారు.