ఉక్కునగరం : ఉక్కునగరంలోని సువిశాలమైన తృష్ణ గ్రౌండ్స్‌లో ఆర్‌ఐఎన్‌ఎల్ సిఎమ్‌డి అతుల్ భట్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సిఐఎస్‌ఎఫ్ జవాన్ల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అతుల్ భట్ మాట్లాడుతూ, కన్సార్టియం భాగస్వామ్యంతో రారు బరేలీలోని ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్‌లో చక్రాల ఉత్పత్తిని స్థిరీకరించడానికి దారితీసిందని తెలిపారు. ఎల్‌హెచ్‌బి చక్రాల ఉత్పత్తి కోసం హాట్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు. సాధారణ ఉత్పత్తిని ప్రారంభించడానికి ఆర్‌డిఎస్‌ఒ క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి కొనసాగుతున్న బొగ్గు సంక్షోభం, ఉత్పత్తిలో పరిమితి యొక్క సవాలుతో కొత్త ఎఫ్‌వై 22ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
విశాఖపట్నం : ఎన్‌ఎస్‌టిఎల్ సివిలియన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన జాతీయ జెండాను ఎగురవేశారు. ఎన్‌ఎస్‌టిఎల్ డైరెక్టర్ వై.శ్రీనివాసరావు, యూనియన్ అధ్యక్షులు సిహెచ్‌విఎస్‌ఎన్ మూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సైంటిస్ట్ జివి.కృష్ణకుమారి, యూనియన్ ఉపాధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర రావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ హేమంత్ బయాస్, జాయింట్ సెక్రటరీ వి.దుర్గారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటరమణ, ట్రెజరర్ జయన్‌వర్మ పాల్గొన్నారు
హెచ్‌పిసిఎల్‌లో...
ములగాడ : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రిఫైనరీలో సంస్థ ఇన్‌ఛార్జి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.రతన్ రాజ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాలన్నారు. హెచ్‌పిసిఎల్ సిజిఎం (హెచ్‌ఆర్) కె.నగేష్ మాట్లాడుతూ, దేశమే ప్రధానం అనే భానవ ప్రజలందరిలో కలిగించే దిశగా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. కార్యక్రమంలో సంస్థ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హెచ్‌పి శక్తి, హెచ్‌పి స్త్రీ, సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది, ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










