Mar 09,2023 23:34

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.శాంత కుమారి

ప్రజాశక్తి-డుంబ్రిగూడ: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.శాంత కుమారి ఆదేశాల మేరకు మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు యూనియన్‌ బ్యాంక్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ డెలిగేట్‌ సభ్యుడు పి.చిన్నస్వామి మాట్లాడుతూ. గత ప్రధానమంత్రులైన నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీలు ఎల్‌ఐసి, రైల్వే, స్టీల్‌ ప్లాంట్‌తో పాటు విమాన రంగాలు, ఇతర సంస్థలను ప్రభుత్వ పరం చేసి అభివృద్ధి పరిస్తే ప్రస్తుత బిజెపి కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. వీటిని అదాని, అంబానీ వంటి కార్పొరేట్‌ బడా బాబులకు కట్టబెడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పోతురాజు, దయానిది, భీమరావు పాల్గొన్నారు.