Sep 09,2022 23:45

పోర్టు వద్ద నిరసననుద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు

   ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మాలని చూస్తే మోడీ ప్రభుత్వానికి ఖబడ్దార్‌ అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌. నరసింగరావు హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం వెంటనే ఆపాలని డిమాండ్‌ చేస్తూ విశాఖలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థల వద్ద శుక్రవారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యాన విశాఖపట్నం పోర్టు, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసి, బిహెచ్‌ఇఎల్‌, షిప్‌యార్డ్‌, హెచ్‌పిసిఎల్‌, బిడిఎల్‌, ఎన్‌టిపిసి, స్టీల్‌ప్లాంట్‌లోని అన్ని విభాగాల హెచ్‌ఒడి కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలకు సిహెచ్‌.నర్సింగరావు హాజరై మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మాలని నిర్ణయం చేసి 600 రోజులు అవుతున్నా కనీసం స్టీల్‌ప్లాంట్‌ లోపలికి కూడా అడుగుపెట్టలేకపోయారన్నారు. విశాఖపట్నం అభివృద్ధికి వివిధ పరిశ్రమలు రావడానికి మూల కారణం విశాఖపోర్టు అనంతరం షిప్‌యార్డ్‌, డాక్‌యార్డ్‌, బిహెచ్‌ఇఎల్‌, హెచ్‌పిసిఎల్‌ చివరగా 80వ దశకంలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మించారని తెలిపారు. తరువాత ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. సేవా రంగంలో ఎల్‌ఐసి, బ్యాంకులు, బిఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే వంటివి ఉండటంతో విశాఖపట్నం అభివృద్ధికి తోడ్పడ్డాయని చెప్పారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉన్న పరిశ్రమలు అమ్మేయడం లేదా మూతవేయడం ఒక విధానంగా తీసుకొని దేశం మొత్తం మీద హోల్‌సేల్‌గా అమ్మేస్తున్నారని విమర్శించారు. ఈ పరిశ్రమలన్నీ ప్రజల పన్నులతో ఏర్పడిన ఆస్తులని, మోడీ, బిజెపి సంపాదించినవి కావని ఎద్దేవాచేశారు. ప్రజల ఆస్తులను అమ్ముతున్న వారికి ప్రజలందరినీ చైతన్యం చేసి ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.
వివిధ పరిశ్రమల వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, కుమార్‌మంగళం, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.జగన్‌, పోర్టు అధ్యక్ష కార్యదర్శులు సాంబమూర్తి, సత్యనారాయణ, రామలింగశ్వరరావు, డిఎల్‌బి యూనియన్‌ నాయకులు డి.లక్ష్మణరావు, సత్యనారాయణ, ఎఐటియుసి నాయకులు ఆదినారాయణ, రామకృష్ణ, కెఎస్‌ఎన్‌.రావు, మసేను, రమణబాబు, ఐఎన్‌టియుసి నాయకులు నాగభూషణం, చందు, టిఎన్‌టియుసి నాయకులు విళ్ళా రామమోహన్‌, హెచ్‌ఎంఎస్‌ కార్యదర్శి డికె.శర్మ, నాయకులు మంగయ్య నాయుడు, జనతా యూనియన్‌ నాయకులు కనకారావు తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఐసి కార్యాలయం వద్ద
ఎల్‌ఐసి కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజనం విరామ సమయంలో ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ విశాఖపట్నం డివిజన్‌ కమిటీ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్యూరెన్స్‌ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.వరప్రసాద్‌, అధ్యక్షులు ఎం. కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
షిప్‌యార్డులో...
ములగాడ : షిప్‌ యార్డ్‌ ప్రధాన ద్వారం వద్ద షిప్‌ యార్డ్‌ అఖిలపక్షం, స్టీల్‌ప్లాంట్‌ అఖిల పక్ష నాయకులు కలిసి నిరసన తెలిపారు.
హెచ్‌పిసిఎల్‌...
హెచ్‌పిసిఎల్‌ రిఫైనరీ గేటు వద్ద నిరసన తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సిహెచ్‌.నర్సింగరావు, ఎఐటియుసి జిల్లా నాయుకులు రామకృష్ణ, ఐఎన్‌టియుసి జిల్లా కార్యదర్శి బి.నాగభూషణం, టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యదర్శి లెనిన్‌బాబు, హెచ్‌ఎంఎస్‌ జిల్లా నాయకులు డి.అప్పారావు, విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జెఎసి చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు, వైఎస్‌ఆర్‌టియుసి నాయుకులు పివి.సురేష్‌ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వివి కుమార్‌, పబ్లిక్‌ సెక్టర్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ కె.ఎం.కుమార్‌ మంగళం, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరాం, సిఐటియు నాయుకులు ఆర్‌.లక్ష్మణమూర్తి, కె.పెంటారావు, టిఎన్‌టియుసి నాయుకులు వి.రామ్మోహన్‌కుమార్‌, ఎన్‌.లక్ష్మణరావు, ఐయన్‌టియుసి నాయుకులు తాతబాబు, ఎఐటియుసి నాయుకులు సత్యనారాయణ, జి.రాంబాబు, వైఎస్సార్‌టీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌టిపిసిలో...
పరవాడ: పరవాడ ఎన్‌టిపిసి సింహాద్రి వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఐఎన్‌టియుసి, ఎఐటియుసి, టిఎన్‌టియుసి, సిఐటియు నాయకులు కెఎస్‌ఎ రామయ్యనాయుడు, ఎన్‌.రామచంద్రరావు, ఎం.అప్పలనాయుడు, గనిశెట్టి సత్యనారాయణ, బి.అప్పారావు, ఎం.సత్యనారాయణ, పెంటా రెడ్డి, బి.పైడిరాజు, ఆర్‌ఆర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
స్టీల్‌ప్లాంట్‌లో...
ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని అన్ని విభాగాల హెచ్‌ఒడి కార్యాలయాల ముందు ధర్నాలను నిర్వహించారు. ఎస్‌ఎంఎస్‌, సిఐసిసిపి, టిపిపి, బిఎఫ్‌, మిల్స్‌, సింటర్‌ ప్లాంట్‌, ఆర్‌ఎంహెచ్‌పి, డబ్ల్యూఎండి విభాగాధిపతులకు వినతి పత్రాలను అందజేశారు. బిఎఫ్‌ విభాగంలో జరిగిన సమావేశానికి బాబా అధ్యక్షత వహించగా రామకోటేశ్వర రావు, రవికిరణ్‌, మురళీకృష్ణ, శ్రీనివాసరాజు, మధు, మహాలక్ష్మి నాయుడు, సిహెచ్‌.సన్యాసిరావు, జి.అప్పలరాజు, అలమండ శ్రీనివాసరావు పర్మినెంట్‌, కాంట్రాక్టు వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జనరల్‌ హాస్పటల్‌లో
విఎస్‌జిహెచ్‌ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విఎస్‌జిహెచ్‌లో ధర్నా నిర్వహించారు. అనంతరం విభాగాధిపతి డాక్టర్‌ ప్రకాష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బి శ్రీనివాసరావు, కె.గోపాలకృష్ణ, ఎం.దానయ్య, ఎం.నాగేశ్వరరావు, జెర్రిపోతుల మోహన్‌ కుమార్‌, కెఆర్‌.చంద్రమోహన్‌, బి.నాగమణి, జగదాంబ, ఎస్‌ఎన్‌.మల్లేశ్వరరావు, సత్తయ్య ఉషారాణి, డి.వీరస్వామి, సోమరత్నం, న్యూటన్‌, సన్యాసిరావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
పోర్టులో...
విశాఖపట్నం పోర్టు ఎఒబి వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు డి.ఆదినారాయణ, బిసిహెచ్‌ మసేన్‌, రమణబాబు, హెచ్‌ఎంఎస్‌ కార్యదర్శి డికె.శర్మ, నాయకులు మంగయ్య నాయుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.జగన్‌, పోర్ట్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు సాంబమూర్తి, కె.సత్యనారాయణ, రామలింగశ్వరరావు, డిఎల్‌బి యూనియన్‌ నాయకులు డి.లక్ష్మణరావు, సత్యనారాయణ, ఐఎన్‌టియుసి నాయకులు చందు, జనతా యూనియన్‌ నాయకులు కనకారావు తదితరులు పాల్గొన్నారు.