ప్రజాశక్తి - రెడ్డిగూడెం : ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గృహానికి చేరేలా చూడాలని రెడ్డిగూడెం జడ్పిటిసి సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. అన్నేరావుపేట, నాగులూరు, కూనప రాజుపర్వ గ్రామ సచివాలయాలలో జరిగిన గహ సారధులు, సచివాలయాల కన్వీనర్ల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉపయోగించుకుంటున్నారని, ఈ సంక్షేమ కార్యక్రమా లను ప్రతి ఒక్కరికి వివరించవలసిన అవసరం గహ సారధులకు, సచివాలయాల కన్వీనర్లుకు ఉందని తెలిపారు. రెడ్డిగూడెం మండల సచివాలయాల కన్వీనర్ ఉయ్యూరు భరత్ కుమార్ రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బలగాని తిరుపతిరావు, కూనపరాజు పర్వ సర్పంచ్ మాతంగి వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్ తోటకూర రవి బాబు, కన్వీనర్లు పాల్గొన్నారు.










