ప్రజాశక్తి - ఉండ్రాజవరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస నాయుడు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. ఉండ్రాజవరంలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, పురుషులు, విద్యార్థులు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నవి, లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెండే వెంకటరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, వైస్ ఎంపిపి నరహరశెట్టి సరోజ, ఎంపిటిసి సభ్యులు గాడి క్రిస్టాఫర్, నాయకులు డి.సుధాకర్, ఎన్.రాజేష్, ఎం.అనంతలక్ష్మి, ఎం.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.