Dec 27,2022 23:44

ఫోటో ప్రదర్శనను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు


ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు
ప్రజాశక్తి -భీమునిపట్నం :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన విశాఖ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమగ్ర, సమాచార ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎగువపేట వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర ప్రదర్శన, ఐసిడిఎస్‌, కరోనా వ్యాక్సినేషన్‌, స్వచ్ఛభారత్‌, బేటీ బచావో-భేటీ పడావో, ఆత్మనిర్భర భారత్‌ వంటి కార్యక్రమాలపై ఫోటో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాదీ కా అమత్‌ మహోత్సవ్‌లో విద్యార్థులకు పలు అంశాలపై వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే ముత్తంశెట్టి అందజేశారు కార్యక్రమంలో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ సహాయ సంచాలకులు షఫీ అహ్మద్‌, జెడ్‌సి ఎస్‌ వెంకటరమణ, సిడిపిఒ శ్రీదేవి,ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒలు పి.వేణుగోపాల్‌, కె.ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.