
ప్రజాశక్తి - యంత్రాంగం ఎపికి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమాలు జిల్లాలో గురువారం ప్రారంభం అయ్యాయి. గోకవరం జడ్‌పిటిసి దాసరి శ్రీరంగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్ర మంలో ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు పాల్గొని మాట్లా డారు. సర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపిపి, జడ్‌పిటిసిలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులంతా ప్రజల్లోకి విస్త్రతంగా వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ కె.పద్మజ్యోతి, తహశీల్దార్ శ్రీనివాస్, వైసిపి నాయకులు జనపరెడ్డి సుబ్బారావు, దాసరి రమేష్, సుంకర వీరబాబు, వరసాల ప్రసాద్, చింతల అనిల్ కుమార్, కర్రీ సూరరెడ్డి, దాసరి సతీష్, నారాలశెట్టి నరసయ్య, మడికి మైనర్ బాబు, గోకాడ చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు. దేవరపల్లి మండలంలోని దుద్దుకూరులో జరిగిన కార్యక్ర మంలో వైసిపి మండల అధ్యక్షుడు కుచిపూడి సతీష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాన్ని అందించేలా పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కుప్పాల దుర్గారావు, ఎఎంసి ఛైర్మన్ గన్నమణి జనార్దన్ రావు, టిటిడి బోర్డు మెంబర్ ఆచంట అనసూయ, సొసైటీ అధ్యక్షులు కాండ్రు రామకృష్ణ, కొరవటి బుజ్జిబాబు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలంలోని సత్యవాడ, చిలకపాడు క్లస్టర్ గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ ఇందుకూరి దేవి భార్గవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, జడ్‌పిటిసి నందిగం భాస్కర రామయ్య, జెఎస్‌సి ఛైర్మన్ కఠారి సిద్ధార్థ రాజు, నాయకులు ఐవిఎస్.రాజు, పెండ్ర పోసేశ్వరరావు, ఎంపిడిఒ జివిఎస్‌ఆర్‌కె.రాజు, ఇఒపిఆర్‌డి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి, ఆశాలు, వైకాపా అభిమా నులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాగల్లు మండలంలోని చిక్కాలలో సర్పంచ్ కొయ్య మణీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిపి మట్ట వీరాస్వామి, వైసిపి నాయకులు రాయుడు, దొరయ్య, దుర్గ మల్లేశ్వరరావు, ఎంపిడిఒ బి.రాంప్రసాద్ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.