సమావేశంలో మాట్లాడుతున్న సత్యాంజనేయ
ప్రజాశక్తి - ములగాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని సిపిఐ పశ్చిమ నియోజకవర్గం కార్యదర్శి కాండ్రేగుల సత్యాంజనేయ పేర్కొన్నారు. మల్కాపురం గ్రామ మండలిలో పశ్చిమ నియోజకవర్గం సిపిఐ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యాంజనేయ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పశ్చిమ నియోజకవర్గం సహాయ కార్యదర్శి గుడాల రాంబాబు, గండి అప్పారావు, ఎన్‌వి త్రినాథ్, రామకృష్ణ, కనకరాజు, గుడాల జయ తదితరులు పాల్గొన్నారు.










