ప్రజాశక్తి-ఉక్కునగరం : ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వ విధానాలను ఐక్యంగానే తిప్పికొట్టాలని, వీటిపై ప్రజల్లో అవగాహన మరింత పెంచాలని 78వ వార్డు కార్పొరేటర్ బి.గంగారావు పిలుపునిచ్చారు. కూర్మన్నపాలెం ఉడా ఫేస్-7 పార్కు కమ్యునిటీహాల్ వద్ద వార్వా, నివాస్ స్టీల్ జోన్ ఆధ్వర్యాన సమావేశమయ్యారు. ఆస్తి పన్ను, చెత్త పన్ను, ఇతర పన్నుల భారాలపై పలువురు మాట్లాడారు. పోరాటాన్ని కొనసాగించడానికి న్యాయ సలహాలు, కోర్టు కేస్, లోకల్ సమస్యలపై వార్వా జిల్లా అధ్యక్షులు గురప్ప వివరించారు. ప్రభుత్వ విధానాలు, ప్రజలపై భారాలు, నివారణ చర్యలు ఆందోళన కార్యక్రమాల ఆవశ్యకత, అసోసియేషన్ పటిష్టతపై కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు వివరించారు. వార్వా కమిటీ మెంబరు ఎం.కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రమణమూర్తి, కృష్ణార్జున, దత్తాత్రేయరాజు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.










