ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులను చేర్పించాలి : ఎంఇఒ
ప్రజాశక్తి - బేతంచెర్ల
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు పిల్లలను చేర్పించి ఉపాధ్యాయులు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని బేతంచర్ల మండలం ఎంఈఓ సోమశేఖర్ అన్నారు. బేతంచర్ల మండల పరిధిలో గొర్లగుట్ట గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సోమశేఖర్, ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అందుకు ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో చదివించి వారి భవిష్యత్తుకు మంచి తోడ్పాటు ఇవ్వాలని అన్నారు. ప్రధానంగా పిల్లల తల్లిదండ్రులది ప్రధాన పాత్ర అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలని చదివించడానికి తప్పకుండా బాధ్యత వహించాల న్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చలపతి రెడ్డి, రామసుబ్బయ్య, నారాయణరెడ్డి, మద్దిలేటి, శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.










