Oct 14,2023 00:16

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని విద్యా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పిడపర్తి పేరిరెడ్డి పేర్కొన్నారు. పాఠశాల ఆవరణలో  విద్యార్థుల తల్లిదండ్రులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అసైన్మెంట్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ప్రగతిని తల్లిదండ్రులకు వివరించారు.  ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలు తల్లిదండ్రులకు తెలిపారు. విద్యార్థులను చిన్నతనం నుండి క్రమశిక్షణలో ఉంచి పాఠశాలకు పంపించాలని అన్నారు. ప్రతిరోజు పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలౌతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ బార్లపూడి ప్రభాకరరావు, పర్వత నేని పావని, భవనం శివలీల, పెండ్యాల పావని, బండారు అనిల్ కుమార్, అంబటి సురేష్, వసంత రఘుబాబు, సిహెచ్ శ్రీవిద్యలక్ష్మి, పెండ్యాల రాధిక, గోబిదేశి ఆదినారాయణ, వరికొల్లు బ్రహ్మయ్య, గోరంట్ల సంధ్యారాణి, అంబటి అపర్ణ, కంబాలపాటి నరసయ్య పాల్గొన్నారు.